|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:51 PM
బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ముందు ఖడ్గం సినిమాలోని “గోవిందా గోవిందా” పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో రీల్స్ చిత్రీకరణ నిషేధించబడింది. ఈ ఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో ఉంచుకుని నియమాలు కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Latest News