|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:32 PM
సముద్రపు దొంగల దాడులు,దోపిడీలు,నిధుల గురించిన అన్వేషణ తరహా కథతో రూపొందిన సినిమానే 'ది బ్లఫ్'. ప్రియాంక చోప్రా .. కార్ల్ అర్బన్ .. ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది చూద్దాం.
ఈ కథ 1846లో .. కరేబియన్ సముద్ర ప్రాంతంలో మొదలవుతుంది. కెప్టెన్ కాన్నర్ (కాల్ అర్బన్) తన బృందంతో కలిసి సముద్ర దొంగతనాలు చేస్తుంటాడు. అత్యంత శక్తిమంతమైన క్రూరుడిగా ఆయన గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కాన్నర్ ఒక రోజున ఒక నౌకపై దాడి చేస్తాడు. ఆ నౌక బోడెన్ (ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా)కి సంబంధించినది. ఆ నౌకలో ప్రత్యేకమైన ముద్ర కలిగిన ఒక బంగారం అచ్చు అతనికి కనిపిస్తుంది. ఆ బంగారం అచ్చు చూడగానే అతనికి ఎర్సెల్ (ప్రియాంక చోప్రా) గుర్తుకు వస్తుంది. 'కేమన్ బ్రాక్' దీవిలో ఎర్సెల్ తన కొడుకు ఐజాక్ .. ఆడపడుచు ఎలిజబెత్ తో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఐజాక్ ఇతరుల సాయం లేకుండా నడవలేడు. అందువలన ఎర్సెల్ అతణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. 'వెస్టన్' ప్రేమలో పడిన ఎలిజబెత్ అతనితో ఇల్లొదిలి వెళ్లిపోవడానికి రహస్య ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటుంది. సముద్రంపైకి వెళ్లి రెండు నెలలు అవుతున్నా బోడెన్ బృందం తిరిగిరాకపోవడంతో దీవి ప్రజలు ఆలోచనలో పడతారు. బోడెన్ భార్యనే ఎర్సెల్ అని తెలుసుకున్న కాన్నర్, బోడెన్ తో పాటు అతని బృందాన్ని బంధిస్తాడు. అతని ద్వారా ఎర్సెల్ ను పట్టుకోవడానికి ఆ దీవికి చేరుకుంటాడు. తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆ దీవిపై విరుచుకుపడతాడు. అప్పుడు ఎర్సెల్ ఏం చేస్తుంది? గతంలో ఆమెతో కాన్నర్ కి ఉన్న సంబంధం ఏమిటి? బంగారం అచ్చు చూడగానే అతనికి ఆమె ఎందుకు గుర్తుకొస్తుంది? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎర్సెల్ ఎలాంటి ప్రమాదాలను ఫేస్ చేస్తుంది? అనేది మిగతా కథ.
Latest News