|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:22 PM
సినిమాలు, రాజకీయాలు, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకునే బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన సైనిక దాడి, ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో అమెరికా, ఇజ్రాయెల్ హద్దులు మీరాయని, ఇది ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని ఆయన విశ్లేషించారు.తాజాగా తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో జావేద్ అక్తర్ ఒక పోస్ట్ పెట్టారు. "ఈసారి ట్రంప్, ఇజ్రాయెల్ హద్దులు మీరారని నేను భావిస్తున్నాను. ఈ దుశ్చర్యకు పాల్పడి, ఇరాక్‌కు పట్టిన గతే ఇరాన్‌కు కూడా పట్టించాలని చూస్తే... ప్రపంచంలో చైనా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతుంది. నెతన్యాహు, ట్రంప్ లాంటి వాళ్లు ఇతరులను ఒక మూలకు నెట్టేశారు. చివరికి వారు కచ్చితంగా స్పందించక తప్పని పరిస్థితిని కల్పించారు" అని ఆయన పేర్కొన్నారు.
Latest News