|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:20 PM
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో తన సోదరుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత, క్షిపణి దాడుల వార్తల నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందిస్తూ.. "విష్ణు, ఆయన అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కష్టకాలంలో మన సొంత వాళ్ళు ఆపదలో ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. మిమ్మల్ని నా గుండెల్లో హత్తుకుంటున్నాను. దేవుడి దయ మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలుస్తుంది" అని ట్వీట్ చేశారు.
Latest News