|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:19 PM
టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ అసాధారణ పోరాటంతో అదరగొట్టాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మొదటి బంతి నుంచి చివరి వరకు క్రీజులో ఉండి, 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేశాడు.శాంసన్ అద్భుతమైన ఆటతీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంజూను ప్రత్యేకంగా అభినందించారు. "సంజూ అద్భుత ఫామ్‌లో ఉండటం చూడటానికి సంతోషంగా ఉంది. ఇది ఒక మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్. ఇది అతని ప్రతిభతో పాటు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కష్ట సమయంలో జట్టును ఆదుకున్న తీరు అద్భుతం" అని ఆయన కొనియాడారు. ఇక ఈ విజయంతో సెమీస్‌కు చేరిన భారత్, గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Latest News