|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:18 PM
హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. సూర్య 46వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.విడుదలైన ఫస్ట్ లుక్‌లో సూర్య కళ్లద్దాలు ధరించి, ఓ చిన్నారిని ఎత్తుకుని ఎంతో ప్రేమగా కనిపిస్తున్నారు. బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో ఆయన లుక్ పరిపక్వంగా, భావోద్వేగభరితంగా ఉంది. సింపుల్‌గా ఉన్నప్పటికీ ఎమోషనల్ టచ్‌తో ఉన్న ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ మూవీలో ‘ప్రేమలు’ చిత్రంతో పాప్యులర్ అయిన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.అలాగే, ఈ ప్రాజెక్ట్‌లో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Latest News