|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:37 PM
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో పాట ‘రై రై రా రా’ మార్చి 2న విడుదలైంది. ఇప్పటికే రిలీజైన మొదటి పాట ‘చికిరి’ మంచి విజయం సాధించగా, ఈ రెండో సింగిల్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి.దిగ్గజ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ గీతానికి అనంతశ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆలపించడం విశేషం. పక్కా మాస్ బీట్, హీరో ఎలివేషన్ థీమ్‌తో సాగే ఈ పాటలో ఇంటెన్స్ ఫోక్ పెర్కషన్ హైలైట్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే విజయ గీతంలా ఇది రూపొందింది. ముఖ్యంగా 'రై రై రా రా' అనే హుక్ లైన్ వినగానే ఆకట్టుకునేలా ఉందని, థియేటర్లలో ఈ పాటకు రెస్పాన్స్ గట్టిగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News