|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 01:48 PM
రోషన్ కనకాల హీరోగా నటించిన 'మోగ్లీ 2025' సినిమా డిసెంబర్ 13న విడుదలైంది. మిక్సెడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ అందుకుంది. బాలకృష్ణ అఖండ 2, రణవీర్ సింగ్ 'ధురంధర్' వంటి పెద్ద సినిమాల మధ్య నలిగిపోయిన ఈ చిత్రం, థియేటర్ రన్ మధ్యలోనే ముగిసింది. దీంతో, విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1 నుంచి ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్యూర్ ఇన్నోసెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
Latest News