|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:39 PM
నాని కథానాయకుడిగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సంపూర్ణేశ్ బాబు పోషిస్తున్న 'బిర్యానీ' అనే పాత్ర ఫస్ట్ లుక్‌ను శుక్రవారం పరిచయం చేశారు. హీరో నాని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను షేర్ చేశాడు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంపూర్ణేశ్ బాబు చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో బీడీ తాగుతూ, మరో చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్నాడు. చేతులకు రక్తపు మరకలు కూడా ఉండటం పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. "సంపూ యాజ్ బిర్యానీ" అంటూ నాని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News