|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:41 PM
జాతిరత్నాలు, మ్యాడ్, మ్యాడ్ 2 చిత్రాల విజయాల తరువాత ఆ తరహా చిత్రాల పరంపర తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువైంది. ఆ కోవలోనే వచ్చిన చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా, జీవన్, రాజ్‌కుమార్, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్ ఆగస్త్య) ఓ బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించి, ఫెయిల్ కావడంతో ఓ పథకం ప్రకారం ఎర్రగడ్డ పిచ్చాసుప్రతిలో జాయిన్ అవుతాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి డబ్బు కొల్లగొట్టడానికి ఓ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని తవ్వి తీసుకొచ్చి.. దాన్ని హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్మశానంలో ఉన్నకళింగ పోతురాజు సమాధిలో పెట్టాలని అనుకుంటారు. ఈ పనిని చేయడం కోసం డబ్బు ఇస్తానని ఆశ చూపి గొయ్యి అలియాస్ కళింగ గవ్వరాజు (జీవన్), మిలటరీ (రాజ్‌కుమార్ కసిరెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్)లను ఒప్పిస్తాడు. ఇక శవాలు మార్చడం కోసం ప్రయత్నించిన పాపిరెడ్డి, సౌదామిని అండ్ గ్యాంగ్‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ కథకు కళింగ రాజులకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు వుడ్‌రాజు (యోగిబాబు) ఎవరు? అనేది మిగతా కథ
Latest News