|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:01 PM
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె, శివాజీ మాట్లాడిన విధానంలో ఆ రెండు పదాలు తప్పే కానీ, ఆయన చెప్పిన ఉద్దేశం నూటికి నూరు పాళ్లు నిజమని సమర్ధించారు. భారతీయ సంస్కృతిలో స్త్రీకి గౌరవం ఉందని, కట్టు బొట్టుతో ఉండటమే మన సంప్రదాయమని ఆమె గుర్తుచేశారు. యాంకర్ అనసూయ తీరును కరాటే కల్యాణి తప్పుబట్టారు. ఇంట్లో శుభకార్యాలకు పద్ధతిగా ఉంటూ, బయట మాత్రం పొట్టి దుస్తులు వేసుకుని 'నా ఇష్టం' అనడం సరికాదని హితవు పలికారు. సినిమా వాళ్లు సమాజానికి రోల్ మోడల్స్ కాబట్టి, బాధ్యతగా ఉండాలని సూచించారు.
Latest News