|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:18 PM
చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 18 నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా థియేటర్‌లో 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలైన ఈ మూవీ, ఓటీటీలో మరిన్ని సన్నివేశాలతో కూడిన ఎక్స్‌టెండెడ్ కట్‌ను విడుదల చేయనున్నట్లు ఈటీవీ విన్ ప్రకటించింది. అఖిల్, తేజస్విరావ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కించారు.
Latest News