|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:08 AM
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఆశించిన స్థాయి హిట్స్ అందుకోకపోయినా, యువ నటి శ్రీలీలకు బాలీవుడ్ నుండి ఊహించని డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా, ఆమెకు ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించబోయే ప్రతిష్టాత్మక ఫాంటసీ - రొమాన్స్ డ్రామా 'ఛూ మంతర్' చిత్రంలో కీలక పాత్ర దక్కే సువర్ణావకాశం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం మొదట ఎంపికైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో 'డ్యాన్స్ క్వీన్' శ్రీలీలను సంప్రదించినట్లు చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం శ్రీలీల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 'ఛూ మంతర్' షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా, అనన్య పాండే మాత్రం తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అనన్య తన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' రెండో సీజన్ షూటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ కీలక ప్రాజెక్ట్‌ను వదులుకోవాల్సి వచ్చింది. 'ముంజ్య', 'స్త్రీ 2' వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాతలతో పనిచేయాలని అనన్య ఆశించినప్పటికీ, దురదృష్టవశాత్తు డేట్స్ క్లాష్ కారణంగా ఆ అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఈ కారణంగానే ఆమె 'ఛూ మంతర్' నుండి వైదొలగక తప్పలేదని తెలుస్తోంది.
Latest News