|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 09:18 PM
తెలుగు నటి సునయన యెల్ల త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాపులర్ అరబ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరిని వివాహం చేసుకోనున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖలీద్ తన పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా, అందులో సునయనతో కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. గతంలో కూడా వీరిద్దరి డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. ఖలీద్ గతంలో సలామా మహ్మద్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు. 2007లో వీరి వివాహం జరగగా, 2024లో విడాకులు తీసుకున్నారు.
Latest News