|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:13 PM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ-2 తాండవం' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.తాజా ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకునేందుకు చిత్రబృందానికి వెసులుబాటు కల్పించారు. ఇక డిసెంబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అయితే, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూనే ప్రభుత్వం చిత్రబృందానికి ఓ షరతు విధించింది. ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని ఆదేశించింది.భారీ అంచనాల మధ్య 'అఖండ-2 తాండవం' డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సమస్యలన్నీ పరిష్కారం కావడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
Latest News