|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:19 PM
డిసెంబర్ 12న విడుదల కానున్న ‘అఖండ-2’ సినిమా కోసం, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మెమో ప్రకారం, డిసెంబర్ 12 నుంచి 14 వరకు సింగిల్ స్క్రీన్‌లలో ₹50, మల్టీప్లెక్స్‌లలో ₹100 అదనంగా వసూలు చేయవచ్చు. డిసెంబర్ 11న రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు ₹600 టిక్కెట్ ధర నిర్ణయించారు. అయితే ఈ అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి.
Latest News