|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:39 PM
ప్రభాస్ రాబోయే ఐదు సినిమాలపై మార్కెట్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'ది రాజా సాబ్' రూ. 400 కోట్లు, 'ఫౌజీ' రూ. 600 కోట్లు, 'సలార్ 2' రూ. 800-900 కోట్లు, 'స్పిరిట్' రూ. 1200 కోట్లు, 'కల్కి 2' రూ. 1350 కోట్లు వ్యాపారం చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఐదు సినిమాల వ్యాపారం రూ. 4000-4500 కోట్లు దాటవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ భారీ వ్యాపారం రిస్క్ తో కూడుకున్నదని, కంటెంట్ బలంగా ఉంటేనే ఈ అంచనాలు నెరవేరుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News