|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:38 PM
పిల్లలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలో 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేధం విధించాలని నటుడు సోనూ సూద్ సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నాయని, భారత ప్రభుత్వం కూడా ఇదే దిశగా ఆలోచించాలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సోషల్ మీడియా వ్యసనం నుండి విముక్తి కలిగేలా చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని, డిజిటల్ మీడియా పిల్లలవ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Latest News