|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:28 PM
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ చిత్ర బృందం తాజాగా ‘గ్రాండ్ రిలీజ్ టీజర్’ను విడుదల చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు.గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, బాలయ్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.
Latest News