|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:44 AM
నటి కృతి సనన్ తన ఎత్తు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తనతో నటించిన హీరోలు తనకంటే పొట్టిగా ఉంటారని, ప్రభాస్, అర్జున్ కపూర్ వంటి వారు మాత్రమే తనకంటే ఎత్తుగా ఉంటారని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలలో మహేష్ బాబు పేరు ప్రస్తావించకపోవడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ అభిమాన నటుడిని అవమానించారని, ఆమె కెరీర్‌కు తొలి అడుగు వేసిన మహేష్ బాబును మర్చిపోవడం సరికాదని సోషల్ మీడియాలో కృతి సనన్ పై ఆగ్రహంతో ఉన్నారు.
Latest News