|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:28 PM
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వయసు 33 ఏళ్లు కావడంతో, ప్రస్తుతం కెరీర్ పై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. వివాహం, పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించలేనని, అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. గతంలో పెళ్లి చేసుకోవడానికి సరైన వయసుపై నమ్మకం లేదని, లేటు వయసులో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పిన రియా, ఇప్పుడు కెరీర్ లో స్థిరపడ్డాకే కుటుంబాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Latest News