|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:50 AM
మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖలీఫా’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే నిత్యం వార్తల్లో నిలుస్తూ కేరళ నాట హాట్ టాపిక్ అవుతోంది. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.కాగా.. మోహన్‌లాల్ ఈ సినిమాలో మంబరక్కల్ అహ్మద్ అలీ అనే పాత్రలో పృథ్వీరాజ్‌కు తాత పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. బంగారం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని నిర్మాతలు రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఓనం సందర్భంగా థియేటర్లకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. రెండో భాగం ప్రీక్వెల్ రూపంలో ఉండి, అందులో మోహన్‌లాల్ పాత్రను మరింత విస్తృతంగా చూపించనున్నారని సమాచారం.
Latest News