|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:51 AM
హైదరాబాద్ ప్రేక్షకులకు అత్యాధునిక సినీ అనుభవాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏఏంబీ సినిమాస్ ఇకపై బెంగళూరులోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆసియన్ సినిమాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ చైన్ ఇప్పటికే హైదరాబాద్‌లో టాప్ మూవీ డెస్టినేషన్‌గా మన్ననలు పొందుతోంది. ఇప్పుడు ఇదే కాంబోను రిపీట్ చేస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఇప్పుడు బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. బెంగళూరు నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్‌కు డిసెంబర్ 16న ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Latest News