|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 01:44 PM
హైదరాబాద్ లూలు మాల్ లో రాజాసాబ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా నటి నిధి అగర్వాల్ కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను తాకుతూ కొందరు దురుసుగా ప్రవర్తించడంతో, బాడీగార్డ్స్ సాయంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గతంలో నిధి అగర్వాల్ కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు, "సినిమా ప్రపంచంలో కాస్టింగ్ కౌచ్ అనేది రాక్షసి, కానీ అది ఉందో లేదో నాకు నిజంగా తెలియదు. నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఒకవేళ ఎదురైతే చాలా బాధగా అనిపిస్తుంది" అని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News