|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:28 PM
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ 2' విడుదల కారణంగా తన 'సైకో సిద్ధార్థ్' సినిమాను వాయిదా వేసుకున్నట్లు నటుడు నందు తెలిపారు. నందు, శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా టైటిల్ సాంగ్ విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. డిసెంబర్ 12న బాలయ్య 'అఖండ 2' వస్తుందని తెలియగానే, రానా, సురేశ్ బాబు పిలిచి 'బాలయ్య సినిమా వస్తుంటే మనం పక్కకు వెళ్లాలని సూచించారు. ఆయనపై గౌరవంతోనే మా సినిమాను వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయం తెలిసి బాలయ్య ఫ్యాన్స్ మాకు ఎంతో సపోర్ట్ చేశారని, మమ్మల్ని థియేటర్‌కు తీసుకెళ్లి 'అఖండ 2' చూపించారన్నారు. త్వరలోనే బాలయ్యను కలుస్తానని నందు అన్నారు.
Latest News