|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:25 PM
ప్రముఖ గాయని స్మిత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తన గాత్రంతో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన ఆమె, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా, కొన్నేళ్ల క్రితం పాత పాటకు కొత్త హంగులద్ది ఆమె విడుదల చేసిన 'మసక మసక చీకటిలో' ఆల్బమ్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పాటకు ఆధునిక హంగులద్దుతూ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుత యువతరాన్ని ఆకట్టుకునే లక్ష్యంతో 'మసక మసక' పాటకు ర్యాప్ జోడించి ఒక కొత్త వీడియోను రూపొందించారు. ఈ పాటలో ఆమెతో పాటు ప్రముఖ నటుడు, ర్యాపర్ నోయల్ కూడా పాల్గొన్నారు. పాత మెలోడీకి నోయల్ ర్యాప్‌ను జోడించి ఈ పాటను మరింత ట్రెండీగా మార్చారు. ఈ ప్రయోగం ద్వారా నాటి తరం అభిమానులతో పాటు నేటి తరం శ్రోతలను కూడా ఆకట్టుకోవాలని స్మిత భావిస్తున్నారు.తాజాగా విడుదల చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. స్మిత, నోయల్ కలిసి చేసిన ఈ కొత్త 'మసక' సాంగ్ ప్రస్తుతం సంగీత ప్రియులను అలరిస్తోంది.
Latest News