|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:04 PM
హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ నటి ప్రీతి జింటా, సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఒక అద్భుతమని, ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆమె కోరారు.ఈ విషయంపై ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ.. "చాలా కాలం తర్వాత ఒంటరిగా థియేటర్‌లో సినిమా చూశాను. మధ్యాహ్నం షో కూడా హౌస్‌ఫుల్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరు నన్ను కట్టిపడేసింది. ఎంతో కష్టమైన కథను ఆయన గొప్పగా తెరకెక్కించారు" అని ప్రీతి పేర్కొన్నారు.
Latest News