|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:12 PM
తనకు వివాహం జరిగిందంటూ తాజాగా ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ప్రముఖ నటి మెహరీన్ కౌర్ పిర్జాదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇలాంటి విషయాలపై మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు.ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నన్ను నమ్మండి" అని పేర్కొన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి నిరాధార వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Latest News