|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:00 PM
నందమూరి బాలకృష్ణ తన నటనతోనే కాకుండా అప్పుడప్పుడు గాత్రంతోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. గతంలో 'పైసా వసూల్' చిత్రంలో "అరె మామా ఏక్ పెగ్‌లా" అంటూ ఆయన పాడిన పాటకు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత బాలయ్యలోని గాయకుడిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంగీత దర్శకుడు తమన్ సిద్ధమయ్యారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'NBK 111' (వర్కింగ్ టైటిల్) చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో ఓ పవర్‌ఫుల్ పాట పాడించనున్నట్లు తమన్ స్వయంగా వెల్లడించారు. ఈ గీతం 'బాహుబలి'లోని "సాహో రే బాహుబలి" తరహాలో ఎంతో శక్తిమంతంగా, ఉత్సాహభరితంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
Latest News