|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:09 PM
అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 66 ఏళ్ల వయస్సు లోనూ ఫిట్ గా కనిపించే ఆయన, గత 15 ఏళ్లుగా ఓ ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. తాను తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఇటీవల ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున, మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. "సుమారు 15 ఏళ్ల క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతూనే ఉన్నాను. అయితే, ఇప్పటివరకు మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోలేదు. దాన్ని వీలైనంత వరకు వాయిదా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కోసం ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్, పీఆర్‌పీ (PRP) వంటి చికిత్సలు తీసుకున్నట్లు నాగార్జున తెలిపారు.
Latest News