|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:53 PM
బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో 'అఖండ 2' శివుడిపై చిత్రీకరించిన సినిమా కాదని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అఘోర గురించిన సినిమా అని స్పష్టం చేశారు. మంచి కార్యం చేసినప్పుడు అడ్డు ఆటంకాలు సహజమన్నారు. సంకల్పబలం గొప్పగా ఉండాలన్నారు. 'అఖండ 3' అవెంజర్స్ స్థాయిలోనే ఉంటుందని, అధర్వణ వేదం, కురుక్షేత్రం నుంచి స్ఫూర్తి పొంది కథలు తీసుకోవచ్చని వివరించారు. వెంట వెంటనే సీక్వెల్స్ తీస్తే బోర్ కొట్టేస్తుందని, అందుకే గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తానని అన్నారు.
Latest News