|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:11 PM
నటుడు, రియల్ హీరోగా పేరొందిన సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 500 మంది మహిళలకు చికిత్స చేయించారు. తన ఫౌండేషన్ ద్వారా ఈ చికిత్సలకు అయిన ఖర్చును భరించామని సోనూ సూద్ తెలిపారు. ఇది ప్రారంభమేనని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని వివరించారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంపైన మరింత దృష్టిసారించినట్లు సోనూ సూద్ పేర్కొన్నారు.‘రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళలు 500 మందిని మేం కాపాడగలిగాం. శస్త్రచికిత్సతో వారందరికీ కొత్త జీవితం లభించింది. 500 కుటుంబాలలో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి’ అని సోనూసూద్ తెలిపారు.
Latest News