|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:36 PM
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన బెంగళూరు రెస్టారెంట్ ‘బాస్టియన్’పై అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించి, అర్ధరాత్రి పార్టీలకు అనుమతించి నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని శిల్పా శెట్టి ఖండించారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉన్నందున మీడియా సంస్థలు సంయమనం పాటించాలని ఆమె కోరారు.
Latest News