|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:58 PM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథానాయకుడికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలియడంతో పాటు, మామ నుంచి ఎదురయ్యే సవాళ్లను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, వారికి పిల్లలు పుట్టారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Latest News