|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:05 PM
భారత చిత్రం ‘ధురంధర్’పై పాకిస్థాన్, కొన్ని గల్ఫ్ దేశాలు నిషేధం విధించినా దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా పాకిస్థాన్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐకి పెద్ద తలనొప్పిగా మారాయి. సినిమాను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో డిజిటల్ ప్రపంచంపై ఐఎస్ఐ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.1999 నాటి ఖాందహార్ విమాన హైజాక్, ముంబై 26/11 దాడులు, కరాచీలోని లియారి గ్యాంగ్ వార్స్ వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చూపించడంతో పాక్ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అయితే, కేవలం రెండు వారాల్లోనే పాకిస్థాన్‌లో దాదాపు 20 లక్షల ఇల్లీగల్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. దీంతో ‘2.0’, ‘రయీస్’ చిత్రాలను వెనక్కి నెట్టి పాక్‌లో అత్యధికంగా పైరసీకి గురైన సినిమాగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది.
Latest News