|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:10 AM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా హత్య చేసి, చెట్టుకు కట్టి తగలబెట్టినట్లుగా వచ్చిన వార్తలపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ చేశారు. 'హిందువులారా.. మేల్కోండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు' అని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలు మౌనంగా ఉన్న సమయంలో కాజల్ ధైర్యంగా స్పందించడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటనపై ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News