|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:50 PM
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, ముందుగా యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్‌ను ప్రశంసించిన అనంతరం, హీరోయిన్ల వేషధారణపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని శివాజీ వ్యాఖ్యానించారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు వేసుకుంటే గౌరవం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. “అందం అంటే గౌరవంతో పాటు ఉండాలి. గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది. దాన్ని దాటి పోతే విమర్శలు తప్పవు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనమే కోల్పోకూడదని అన్నారు.పాత తరం నటి సావిత్రి, సౌందర్య వంటి వారు గౌరవప్రదమైన వేషధారణతోనే చిరస్థాయిగా గుర్తుండిపోయారని, ఈ తరంలోనూ రష్మిక వంటి నటీమణులు తమదైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికలపై కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన మహిళలకే గుర్తింపు లభించిందని ఆయన అన్నారు.
Latest News