|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:41 AM
నటి కళ్యాణి ప్రియదర్శన్, 'కొత్త లోక' (చాప్టర్ 1 చంద్ర) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి, రివ్యూలే తమకు ఊపిరి పోశాయని, సినిమా షూటింగ్ అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని తెలిపారు. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు తనను సూపర్ హీరోగా అంగీకరిస్తారో లేదోనని భయపడ్డారని, పాజిటివ్ రివ్యూలు వచ్చాక ఊపిరి తిరిగి వచ్చిందన్నారు.
Latest News