|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:13 PM
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ప్రముఖుల మరణాలతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... త్రిపుణితురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్‌కు భార్య విమల, ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. వీరిద్దరూ మలయాళ చిత్ర పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా రాణిస్తుండటం గమనార్హం.శ్రీనివాసన్ సినీ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది. తన కెరీర్ లో ఆయన 225కి పైగా చిత్రాల్లో నటించారు. తనదైన ప్రత్యేక నటన, సామాజిక అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించే హాస్యంతో మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగానూ ఆయన పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు.
Latest News