|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:10 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన అమ్మాయి... టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య వి.వి. సుమలతా దేవిపై సంచలన ఆరోపణలు చేసింది. నిందితుడైన జానీ మాస్టర్‌ను సుమలత కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న వ్యక్తిని రక్షించడం కోసం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సుమలత ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది. తన భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, “నా పని ప్రదేశంలో నేను సురక్షితంగా ఉన్నానా? ఒక నేరస్థుడిని కాపాడటానికి నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?” అంటూ నిలదీసింది.
Latest News