|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:00 PM
ఈ సంవత్సరం విడుదలైన 'లిటిల్ హార్ట్స్' సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పెద్ద సినిమాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలోనే కాకుండా, ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి స్పందన లభించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలై, ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
Latest News