|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:56 PM
‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు స్పందించగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. శివాజీ పూర్తి పేరు కూడా తనకు తెలియదని పేర్కొంటూనే అతడిని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. 'నీలాంటి అసభ్యకరమైన వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి, వెళ్లి నీ నీతులు వాళ్లకి చెప్పుకో. సమాజంలో మహిళలపై, చిత్ర పరిశ్రమపై నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు' అని శివాజీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Latest News