|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:54 PM
బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే ఇటీవల తన తాజా చిత్రం ‘సాలీ మొహబ్బత్’ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ 3-4 కిలోలు బరువు పెరగడం వల్ల ఒక పెద్ద సినిమాలో అవకాశం కోల్పోయానని తెలిపారు. లండన్‌లో డ్యాన్స్ నేర్చుకుని, విహారయాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత షూటింగ్‌కు వెళ్లినప్పుడు కాస్త బొద్దుగా కనిపించడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా భారీ విజయం సాధించి, కొత్త నటుల జీవితాలను మార్చిందని, ఒకవేళ తాను ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని రాధికా అభిప్రాయపడ్డారు.
Latest News