|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 07:37 PM
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటి నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి, మహిళా కమిషన్ సైతం మండిపడింది. విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది.
క్షమాపణలు చెప్పిన శివాజీ..
తన కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు.