|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 01:51 PM
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'వారణాసి' షూటింగ్ మరో 8 నెలల్లో పూర్తి కానుంది. ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, 'వారణాసి' తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని సొంత బ్యానర్ ఎంజీబీలోనే నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తన బ్యానర్‌లో సినిమా చేసినా, భాగస్వామిగా వ్యవహరించే నిర్మాతలతో కలిసి పనిచేయాలని మహేష్ ఆలోచిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే, జూన్‌లో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో మహేష్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Latest News