|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:08 AM
సంక్రాంతికి రానున్న 'ది రాజాసాబ్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో అభిమానులను కలిసిన ప్రభాస్, వారిని సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా పలకరించారు. శ్రీలేఖ అనే లేడీ ఫ్యాన్, ప్రభాస్ తనను స్వయంగా గేటు వద్దకు వచ్చి ఆహ్వానించి, ఇంట్లోకి తీసుకెళ్లి, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రభాస్ ను ఇంత దగ్గరగా కలవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది.
Latest News