|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:12 PM
భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ మలయాళ చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించాడు. మంచి సినిమాలను చూసినప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకునే డీకే, ఇటీవల తాను చూసిన రెండు మలయాళ చిత్రాలను ఆకాశానికెత్తాడు. మలయాళ సినిమా వేరే లెవల్లో ఉందని కొనియాడాడు.ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో దినేశ్ కార్తీక్ ఒక పోస్ట్ చేశాడు. "గత వారంలో 'పొన్మన్', 'ఎకో' అనే రెండు అద్భుతమైన చిత్రాలు చూశాను. 'పొన్మన్'లో నటుడు బాసిల్ జోసెఫ్ నటన అమోఘం. సినిమా మొత్తం అతడి పాత్రతోనే మనం ప్రయాణిస్తాం. అందులో ఇతర నటులు కూడా అద్భుతంగా చేశారు" అని పేర్కొన్నాడు.అనంతరం 'ఎకో' చిత్రం గురించి స్పందిస్తూ... "ఈ సినిమా సినిమాటోగ్రఫీ, లొకేషన్లు, ప్రత్యేకమైన కథ నన్ను ఆశ్చర్యపరిచాయి. దర్శకుడు దిన్జిత్ దీన్ని అద్భుతంగా తీశారు. మలయాళ సినిమా స్థాయి నిజంగా వేరు. ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి" అని కార్తీక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Latest News