|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:07 AM
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' చిత్రం జనవరి 9న విడుదల కానుంది. జనవరి 8న స్పెషల్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో భారీగా ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేసారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.800 వరకు ఉండే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో స్పెషల్ షోలకి ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టిన సినిమాలకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అందుకే ఇప్పుడు 'ది రాజా సాబ్'కి రూ.800 రేటు పెట్టడం వల్ల, ఆడియన్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Latest News