|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:57 PM
నటి పూనమ్ కౌర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలు వెల్లడించారు. మీడియా తనను ఎలా తప్పుగా చిత్రీకరించిందో, రాజకీయ వర్గాల నుండి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు. పోలీసు స్టేషన్లలో న్యాయం అమ్ముడుపోతుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ 97 మంది ఎంపీల సంతకాలు సేకరించిన తన కృషిని ప్రజలు రాజకీయ కోణంలో చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అమ్మమ్మకు గుండెపోటు వచ్చినప్పుడు, తాను పడుతున్న కష్టం కుటుంబంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
Latest News