|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:19 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ రిద్ధి కుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిద్ధి కుమార్ తాను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలిపారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రిద్ధి కుమార్ మాట్లాడుతూ, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున సెట్స్ లో మొదటిసారి అడుగుపెట్టానని, అప్పుడు ప్రభాస్ కు 'మృత్యుంజయ్' పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చానని తెలిపారు. ప్రభాస్ తనకు దీపావళి బహుమతిగా ఒక శారీ ఇచ్చారని, అది చాలా బాగుందని, దానిని మూడేళ్లు దాచుకుని, రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కట్టుకున్నానని వెల్లడించారు.
Latest News